సీపీఎ్‌సను తక్షణమే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-08-12T06:27:13+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంగన్న డిమాండ్‌ చేశారు.

సీపీఎ్‌సను తక్షణమే రద్దు చేయాలి
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంగన్న

కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 11: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంగన్న డిమాండ్‌ చేశారు. గురువారం ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో వంద రోజుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రంగన్న మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని కోరారు. జీవో 117ను రద్దు చేయాలని, లేకపోతే ప్రాథమిక విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుందని అన్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు కొనసాగించాలని, వాటిని ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీల కోసం తక్షణమే షెడ్యూల్‌ను విడుదల చేసి పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు, పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించాలని, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్న పీఎఫ్‌ రుణాలను తక్షణమే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుల్తాన్‌ హుశేన్‌, నరసింహులు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, సంజీవుడు, నాగేటి ప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు తిక్కస్వామి, సుదర్శన్‌ రెడ్డి, వీర నాగేంద్ర, వీరేష్‌, నల్లన్న, మహేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-08-12T06:27:13+05:30 IST