అగ్నిమాపక అధికారి నివాసంలో చోరీ

ABN , First Publish Date - 2020-11-30T05:02:45+05:30 IST

చిలకలూరిపేట అగ్నిమాపకశాఖాధికారి నివాసంలో చోరీ ఘటన ఆదివారం వెలుగు చూసింది.

అగ్నిమాపక అధికారి నివాసంలో చోరీ

చిలకలూరిపేట, నవంబరు 29: చిలకలూరిపేట అగ్నిమాపకశాఖాధికారి నివాసంలో చోరీ ఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బ్యాంక్‌ కాలనీలో నివాసం ఉంటున్న కె.సునీల్‌ వృత్తిలో భాగంగా సత్తెనపల్లి వెళ్లి వస్తుంటారు. ఇంట్లో మిగిలిన వారు ఊరు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన సునీల్‌ ఇంటి తాళాలు, బీరువా పగలగొట్టి ఉండటం గమనించాడు. 32 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25వేల విలువ చేసే కెమెరా, రూ.5వేల నగదు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఎస్‌ఐ రాంబాబు సిబ్బందితో అక్కడకు చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-11-30T05:02:45+05:30 IST