వావ్‌... వాక్కాయ!

ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST

వాక్కాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా వస్తున్నాయి. వాటిని ఆహారంగా ఎలా తీసుకోవాలి? అవి ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడతాయి?...

వావ్‌... వాక్కాయ!

వాక్కాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా వస్తున్నాయి. వాటిని ఆహారంగా ఎలా తీసుకోవాలి? అవి ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడతాయి?

-వాసు, హైదరాబాద్‌


వాక్కాయలు వర్షాకాలంలో బాగా వస్తాయి. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువ కాబట్టి, ప్రకృతి మనకు వాక్కాయలు ప్రసాదించిందేమో అనిపిస్తుంది. వాక్కాయ అరుగుదలను పెంచుతుంది. అందుకు కూరల్లో చింతపండుకు బదులుగా ఈ సీజన్‌లో వాక్కాయలు వాడొచ్చు. వీటిలో విటమిన్‌ సి ఉంటుంది. కాబట్టి పచ్చడిలాగా, సలాడ్‌లాగా చేసుకుంటే బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాక్కాయలు ఆందోళనను తగ్గిస్తాయి. ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌ను పెంచుతాయి. ఇవి దొరికినంత కాలం ప్రతిరోజూ ఆహారంలో చేర్చండి. వీటితో రెండు రెసిపీలు...


వాక్కాయ సలాడ్‌

కావాల్సినవి: అరకప్పు వాక్కాయ ముక్కలు, ఒక టీ స్పూను పచ్చిమిర్చి పేస్టు, రెండు టీ స్పూనులు పంచదార, అర టీ స్పూను మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఒక టీ స్పూను నువ్వుల నూనె

తయారీ: అన్నీ ఒక గిన్నెలో కలిపి, భోజనంతో పాటు తినొచ్చు. వెరైటీగా ఆపిల్‌ ముక్కలు, జామకాయ ముక్కలు, బొప్పాయి ముక్కలను కూడా కలపవచ్చు. 


వాక్కాయ కొబ్బరి చట్నీ

కావాల్సినవి: అరకప్పు వాక్కాయ ముక్కలు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, నాలుగు పచ్చి మిరపకాయలు, మూడు వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు

తయారీ: అన్నీ కలిపి గ్రైండ్‌ చేసుకుని, భోజనం లేదా టిఫిన్స్‌తో తీసుకోవచ్చు. వీటితో పాటు వాక్కాయ పప్పు, పులిహోర, సాంబారు, మురబ్బా, హల్వా... ఇలా ఎన్నో రకాలుగా వాక్కాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ సీజన్‌లో ఇవి ఎక్కువగా వస్తాయి కాబట్టి వీటని తేనె వేసి నిల్వ ఉంచుకోవచ్చు.




కూరల్లో చింతపండుకు బదులుగా ఈ సీజన్‌లో వాక్కాయలు వాడొచ్చు. వీటిలో విటమిన్‌ సి ఉంటుంది. కాబట్టి పచ్చడిలాగా, సలాడ్‌లాగా చేసుకుంటే బాగుంటుంది. వాక్కాయలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. 


- డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com 

Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST