పంట విరామం అనే మాట.. వినబడకుండా చూడాలి!

ABN , First Publish Date - 2022-06-26T07:09:13+05:30 IST

పంట విరామం అనే మాట వినబడకుండా అధికారులు సమన్వయంతో రైతాంగానికి అన్నివిధాలా తోడ్పాటు అందించి ఖరీఫ్‌ సీజన్‌ను లాభసాటిగా మార్చాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ పిలుపునిచ్చారు.

పంట విరామం అనే మాట..  వినబడకుండా చూడాలి!
సమీక్షలో మాట్లాడుతున్న జిల్లా ఇన్చార్జి మంత్రి జోగి రమేష్‌

అభివృద్ధి కార్యక్రమాలపై ముందస్తు సమీక్ష 

 రైతులకు అన్ని విధాలా తోడ్పాటునందించాలి

ప్రాధాన్యతా అంశాలపై చర్చించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్‌

అమలాపురం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పంట విరామం అనే మాట వినబడకుండా అధికారులు సమన్వయంతో రైతాంగానికి అన్నివిధాలా తోడ్పాటు అందించి ఖరీఫ్‌ సీజన్‌ను లాభసాటిగా మార్చాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు అన్నిశాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించనున్న సమీక్షలో భాగంగా ముందస్తు సమీక్షా సమావేశం శనివారం అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించారు. ఇన్‌చార్జి మంత్రి రమేష్‌ మాట్లాడుతూ జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలన్నారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్ర మంలో భాగంగా ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులను గృహాలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. సెంట్రల్‌ డెల్టా, తూర్పు డెల్టా పంటకాల్వలు, డ్రెయిన్లలో పేరుకుపో యిన తూడు, గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీతలకు సం బంధించి ప్రతిపాదనలు సిద్ధంచేసి ముఖ్యమంత్రి సమీక్షలో అందించాలన్నారు. గతంలో నిలిచిపోయిన డెల్టా ఆధునికీక రణ పనులు పునఃప్రారంభించాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పం చాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రతిపాదించా లని సూచించారు. నూతన వంతెనల నిర్మాణాలపై సమీ క్షించారు. కోనసీమ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, పలు శాఖల కార్యాలయాల సముదాయానికి, జిల్లా పోలీసు కార్యాలయం, కలెక్టర్‌, ఎస్పీ బంగ్లాల నిర్మాణాలకు అవసర మైన స్థల సేకరణను కూడా ప్రతిపాదించాలన్నారు. మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ ఇళ్ల స్థల పట్టా భూము లను మెరక చేసేందుకు అవసరమైన మట్టి సేకరణ చేపట్టాలన్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ డామేజ్‌ కంట్రోల్‌ టెక్నాలజీని ఆచరణలోకి తెస్తే రోడ్ల మన్నిక పెరుగుతుందన్నారు. ప్రభు త్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మె ల్యే కొండేటి చిట్టిబాబులు గృహనిర్మాణాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను, రాజోలు, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, పొన్నాడ సతీష్‌కుమార్‌లు పలు అంశాల ను చర్చించారు. సమీక్షలో ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, జేసీ హెచ్‌ఎం ధ్యానచంద్ర, ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీవో వసంత రాయుడు, అధికారులు ఎన్వీ కృష్ణారెడ్డి, రాజేంద్ర, రామగో పాల్‌, డాక్టర్‌ పద్మశ్రీరాణి, జ్యోత్స్న, రవిబాబు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T07:09:13+05:30 IST