July-August నాటికి దేశంలో కరెంట్ కొరత: CREA report

ABN , First Publish Date - 2022-05-30T17:34:40+05:30 IST

దేశంలోని అన్ని పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండడం కారణంగా రానున్న రోజుల్లో కరెంట్ కొరత తప్పదని ది సెంట్రల్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్స్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (Centre for Research on Energy and Clean Air's) చేపట్టిన స్వతంత్ర సర్వే తెలిపింది. జూలై-ఆగస్టు నాటికి ఈ పరిస్థితి తీవ్రంగా మారనుందని CREA పేర్కొంది..

July-August నాటికి దేశంలో కరెంట్ కొరత: CREA report

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండడం కారణంగా రానున్న రోజుల్లో కరెంట్ కొరత తప్పదని ది సెంట్రల్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్స్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (Centre for Research on Energy and Clean Air's) చేపట్టిన స్వతంత్ర సర్వే తెలిపింది. జూలై-ఆగస్టు నాటికి ఈ పరిస్థితి తీవ్రంగా మారనుందని CREA పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని పవర్‌ప్లాంట్లలో 13.5 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉందని, వర్షాకాలం ముందు ఇంత తక్కువ నిల్వలు ఉంటే దేశంలో పెరుగుతున్న డిమాండ్‌కు సరిపోదని తెలిపారు. ‘‘దేశంలో స్వల్పంగా విద్యుత్ డిమాండ్ పెరిగినా పరిష్కరించలేని స్థితిలో పవర్‌ప్లాంట్‌లు ఉన్నాయి. బొగ్గు సరఫరా, నిల్వలపై ముందస్తు ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఉంది’’ అని CREA పేర్కొంది. ఆగస్టు నాటికి 214 గిగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (CEA) అంచనా వేసింది. దీనికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండకపోవచ్చని సీఈఏ సైతం అభిప్రాయపడింది.

Updated Date - 2022-05-30T17:34:40+05:30 IST