లాక్‌డౌన్‌లో క్రియేటివ్‌ థాట్‌.. ఆకట్టుకుంటున్న వెరైటీ ఆర్ట్

ABN , First Publish Date - 2020-07-07T23:42:01+05:30 IST

బోస్నియాలో 2 నెలలపాటు లాక్‌డౌన్‌‌ను విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో...

లాక్‌డౌన్‌లో క్రియేటివ్‌ థాట్‌.. ఆకట్టుకుంటున్న వెరైటీ ఆర్ట్

బోస్నియాలో 2 నెలలపాటు లాక్‌డౌన్‌‌ను విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేసింది. ఇక లాక్‌డౌన్‌‌తో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో రికార్డో డ్రస్కిక్‌ తైపీ తనలోని క్రియేటివిటీకి పదును పెట్టారు. వెరైటీ కళాఖండాలను ప్రదర్శించారు. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్న సమయాన్ని అతను సద్వినియోగం చేసుకున్నారు.  పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తూ డ్రస్కిక్‌ డిజిటల్‌ కోల్లెజ్‌లు రూపొందించారు. న్యూయార్క్‌, మయామి, బెర్లిన్‌ సహా పలుదేశాల్లో ఈ చిత్రాలను ప్రదర్శించారు. బోస్నియాలో పిల్లలు, వృద్ధులకు ఆహారం అందించే సంస్థకు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న డ్రస్కిక్.. ఆన్‌లైన్‌లో తన కళాఖండాలను విక్రయానికి పెట్టారు. 


సోషల్‌ మీడియాలో తన ఆర్ట్‌వర్క్‌ను ప్రదర్శించిన డ్రస్కిక్‌... వాటిని అమ్మడం ద్వారా నిధులు సమకూరాయని తెలిపారు. సారజేవోలోని హిస్టరీ మ్యూజియంలో లక్ష చిత్రాల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. నాజీ లైట్‌ఫైటర్‌ విమానం నమూనాపై కూడా డ్రస్కిక్‌ ఆర్ట్‌వర్క్‌ చేశారు. రెండో ప్రపంచయుద్ధంలో ఈ విమానాన్ని ఉపయోగించారు. 

Updated Date - 2020-07-07T23:42:01+05:30 IST