విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-09-24T06:22:23+05:30 IST

విద్యార్థుల్లో సృజనాత్మకతను ఉపాధ్యాయులు గుర్తించాలని డీఈవో అశోక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తగూడెం, గోండ్రియాల ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించాలి
విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఈవో అశోక్‌

 అనంతగిరి, సెప్టెంబరు 23: విద్యార్థుల్లో సృజనాత్మకతను ఉపాధ్యాయులు గుర్తించాలని డీఈవో అశోక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తగూడెం, గోండ్రియాల ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా  తనిఖీ చేశారు.  నేరుగా తరగతి గదుల్లోకి  వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల్లో కనీస అభ్యాసనా సామర్థ్యాలను పరీక్షించారు. మధ్యాహ్నం భోజనంలో గుడ్లు పెడుతున్నారా? అని విద్యార్థులను ప్రశ్నించి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం హరికిషన్‌, సుధాకర్‌, ఆర్‌ఆర్‌కే రెడ్డి, పాల్గొన్నారు. 




Updated Date - 2022-09-24T06:22:23+05:30 IST