PM Modi : కొవిడ్‌పై పోరాటంలో రాష్ట్రాలది ముఖ్య పాత్ర : ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-08-08T03:20:06+05:30 IST

కొవిడ్-19 మహమ్మారిపై (Covid-19) పోరాటంలో అన్ని రాష్ట్రాలు ముఖ్య భూమిక పోషించాయని, తమ స్థాయికి తగ్గ సహకారాన్ని అందించాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రశంసించారు.

PM Modi : కొవిడ్‌పై పోరాటంలో రాష్ట్రాలది ముఖ్య పాత్ర : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారిపై (Covid-19) పోరాటంలో అన్ని రాష్ట్రాలు ముఖ్య భూమిక పోషించాయని, తమ స్థాయికి తగ్గ సహకారాన్ని అందించాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రశంసించారు. రాష్ట్రాల ఉమ్మడి పోరాట ఫలితంగా వర్ధమాన దేశాలకు ఉదాహరణగా భారత్ నిలిచిందన్నారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగగలదని చాటిచెప్పిందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో తొలిసారి అన్నీ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఒకే చోట ఉమ్మడిగా సమావేశమయ్యారని మోదీ తెలిపారు. జాతీయ ప్రాధాన్యతా అంశాలపై మూడు రోజులపాటు సీఎస్‌లు చర్చించనున్నారని వివరించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశానికి మోదీ సారధ్యం వహించారు. 


కరోనా లాక్‌డౌన్ తర్వాత జరిగిన ఈ తొలి సమావేశంలో 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. పాల్గొన్న సీఎంలు, లెఫ్టనెంట్ గవర్నర్లు అందరూ మాట్లాడారు. తమ రాష్ట్రాల ప్రాధాన్యతలు, విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు.

Updated Date - 2022-08-08T03:20:06+05:30 IST