రుణ పరిమితి పెంపు

ABN , First Publish Date - 2021-03-06T05:09:57+05:30 IST

రైతులకు అందించే పంట రుణాలు ఈ ఏడాది మరింత పెరగనున్నాయి.

రుణ పరిమితి పెంపు

2021-22 ఏడాదికి నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌
వరి ఎకరాకు రూ.36వేల నుంచి రూ.45వేలకు పెంపు
పత్తికి రూ.38వేల నుంచి రూ.40వేలు
ఏప్రిల్‌ నుంచి అమలులోకి తాజా పెరుగుదల
కామారెడ్డి, మార్చి 5: రైతులకు అందించే పంట రుణాలు ఈ ఏడాది మరింత పెరగనున్నాయి. ఏటా ప్రభుత్వం సాగు వ్యయాలను పరిగణ లోకి తీసుకుని జిల్లాల వారిగా కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి పంటలపై ఇచ్చే రుణాలు కొంతమేర పెంచింది. ఇందులో భాగంగా 2021-22 సంవత్సరానికి పంటలకు, కూరగాయలకు, తోటలకు ఎకరాకు ఇచ్చే రుణాల విషయంలో జనవరిలో జిల్లాస్థాయి టెక్నికల్‌ కమిటీ (డీఎల్‌టీసీ) సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ లెక్కన ప్రభుత్వం పంటలకు ఇచ్చే రుణాలు కొంత పెంచుతూ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకటించింది. వచ్చే ఖరీఫ్‌, రబీలో వేసే పంటలకు బ్యాంకు లు ఈ రుణాలు ఇస్తాయి. ఏప్రిల్‌ నుంచి ఈ రుణ పరిమితి అమలు కానుంది.
ప్రధాన పంట వరికి రూ. 45 వేలు
రాష్ట్రంలో ప్రధానంగా సాగుచేసే వరి పంటకు ఎకరాకు ఇచ్చే రుణాన్ని ఈ ఏడాది అధిక మొత్తంలో పెంచింది. గతేడాది నీటి వసతి ఉన్న పొలా నికి ఎకరాకు రూ.36 వేల రుణం ఇవ్వగా ఈ సారి ఏకంగా రూ.9 వేలు పెంచి రూ.45వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే పత్తి పంటపై కేవలం రూ.2వేలు మాత్రమే పెంచారు. గతేడాది వర్షాధారంగా సాగుచేసే పత్తికి రూ.38వేలు ఇచ్చేవారు. ఈ సారి రూ.40వేలకు పెంచారు. ఇక బోరు, బావుల కింద సాగుచేస్తే రూ.42వేల వరకు ఇస్తారు. వర్షాధారంగా సాగుచేసే మొక్కజొన్నకు రూ.22వేల నుంచి రూ.25వేలు, నీటి వసతి ఉంటే రూ.28వేల నుంచి రూ.31వేలకు పెంచారు. జొన్నపంటకు నీటికింద రూ.17వేల నుంచి రూ.21వేలకు పెంచారు. వేరుశనగకు నీటి వసతి ఉంటే రూ.24వేల నుంచి రూ.26వేలు, వర్షాధారంగా పండిస్తే రూ.22వేల నుంచి రూ.25వేలకు పెరిగింది. వర్షాధారంగా సాగుచేసే కంది పంటకు రూ.16,500 నుంచి రూ.20వేలకు పెంచి రుణం ఇవ్వనున్నారు. కూరగా యాలకు ఎకరాకు రూ.28 వేలు ఇచ్చే రుణం రూ.32వేలకు పెంచారు.
స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పెంపు
అన్ని పంటలపై గతేడాది స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రూ.3వేల నుంచి రూ.9వేల వరకు పెరిగింది. అన్ని పంటలతో పోల్చితే వరి సాగుపై నే అధికంగా రుణ పరిమితి పెంచింది. రాష్ట్రంలో వర్షాలు అధికంగా రావడం చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళాలాడుండడం భూగర్భజలాలు పెరిగాయి. దీంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. దీంతో పాటు పంట సాగు వ్యయం సైతం అధికం కావడంతో పంట రుణం అధికంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతులకు ఇచ్చే పంట రుణాలు ప్రభుత్వం నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం అందిస్తారు. రాష్ట్రం లోని అన్ని బ్యాంకుల్లో ఈ లెక్కల ప్రకారమే ఆయా పంట సాగుకు రుణాలు అందిస్తారు.
ఏప్రిల్‌ నుంచి అమలు
స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఈ ఆర్థిక ఏడాది ముగిసిన తర్వాత ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తోంది. జిల్లాలో నిర్ధేశించిన పంటలను సాగు చేస్తున్నట్లు గుర్తించి ఈ రైతులకు పంట రుణాలు అందిస్తారు. అన్ని బ్యాంకులకు ఈ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ వర్తిస్తోంది. ఖరీఫ్‌, ర బీ పంటలకు ఈ పంట రుణాలు ఇస్తారు. ఆ ఆర్థిక ప్రమాణంతో పాటు బ్యాంకు మేనేజర్‌కు 30 శాతం అధికంగా రుణం ఇచ్చే అధికారం ఉంటుంది. సకాలంలో తీసుకున్న పంట రుణాలు రెన్యూవల్‌ చేసుకుంటే రైతుకే మేలు జరుగుతోంది.

Updated Date - 2021-03-06T05:09:57+05:30 IST