క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై సీబీఐ దృష్టి

ABN , First Publish Date - 2022-05-17T22:10:53+05:30 IST

ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బెట్టింగ్ మాఫియా విచ్చల విడిగా బెట్టింగ్ లు కాస్తోంది.

క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై సీబీఐ దృష్టి

హైదరాబాద్‌: ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బెట్టింగ్ మాఫియా విచ్చల విడిగా బెట్టింగ్ లు కాస్తోంది. ఈ నేపధ్యంలో  క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై సీబీఐ దృష్టి పెట్టింది. నగరంలో నాలుగు చోట్ల సీబీఐ సోదాలు చేసింది.2013 నుంచి బెట్టింగ్ మాఫియా పాకిస్తాన్ కేంద్రంగా బెట్టింగ్ నడుపుతున్నట్టు సీబీఐ గుర్తించింది. ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్‌కు చెందిన వారిపై కేసులు నమోదు చేసింది.ప్రైవేటు వ్యక్తులతో సహా ప్రభుత్వాధికారుల నివాసాల్లో  సీబీఐ సోదాలు నిర్వహించింది.


ఐపీఎల్‌ బెట్టింగ్‌పై 2 కేసులు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ వాసి దిలీప్ కుమార్‌తో పాటు హైదరాబాద్‌ వాసులు గుర్రం సతీశ్, గుర్రం వాసు పేర్లు నమోదుచేశారు. ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా నెట్‌వర్క్ నిర్వహిస్తున్నారు.పాకిస్తాన్‌కు చెందిన వాకస్ మాలిక్ పేరుతో క్రికెట్‌ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం.రెండో ఎఫ్ఐఆర్‌లో సజ్జన్ సింగ్, ప్రభులాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ పేర్లు నమోదుచేశారు. 

Updated Date - 2022-05-17T22:10:53+05:30 IST