గ్యాస్‌ సిలిండర్‌ పేలి..మూడు పూరిళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2020-12-03T04:04:53+05:30 IST

ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి అగ్ని ప్రమాదం సంభవించడంతో మూడు పూరిల్లు పూర్తి గా కాలిపోయిన సంఘటన మండల పరిదిలోని బిల్లుడు తండాలో బుధవారం జరిగింది.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి..మూడు పూరిళ్లు దగ్ధం
కాలిపోయిన ఇళ్లు

టేకులపల్లి, డిసెంబర్‌ 2: ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి అగ్ని ప్రమాదం సంభవించడంతో మూడు పూరిల్లు పూర్తి గా కాలిపోయిన సంఘటన మండల పరిదిలోని  బిల్లుడు తండాలో బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.మూడు లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. టేకులపల్లి తహసీల్థార్‌ కే.వి శ్రీని వాసరావు తెలిపిన వివరాల ప్రకారం  బిల్లుడు తండ గ్రామా నికి చెందిన అజ్మిరా తారాచంద్‌ ఇంట్లో ఎవరు లేని సమయం లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగి ఇళ్లు కాలిపోగా ఆ పక్కనే ఉన్న ఆయన తండ్రి అజ్మిరా సీతారామ్‌, సోదరుడు లక్ష్మణ్‌ ఇళ్లకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. దాంతో మూడు ఇళ్లు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. యువకులు, గ్రామస్తులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినపట్టికీ ఫలితం లేకుండా పోయింది. కొత్తగూడెం నుంచి అగ్నిమాపక బృందం వచ్చి మంటలను అదుపుచేసి ఇతర ఇళ్లకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఈ ప్రమాదంలో తారాచంద్‌కు చెం దిన 25 క్వింటాల పత్తి, లక్ష్మణ్‌కు చెందిన 10 క్వింటాల వరి ధా న్యంతో పాటు ఇంట్లోని బిరవాలు, బట్టలు, ఆదార్‌, రెషన్‌ కార్డు, పట్టాపుస్తకాలు, వంటసామాగ్రి, మంచాలు కాలిబూడిద య్యాయి. ప్రమాదంలో బాదితులకు కట్టుబట్టలు తప్పా.. మరెమీ మిగలలేదు. జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. బాధితు లకు తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.8వేల చొప్పు న రూ. 24వేలతో పాటు 50 కేజీల బియ్యం జడ్పీ చైర్మన్‌ కోమరం కనక య్య ఆధ్వర్యంలో తహ సీల్థార్‌ అందజేశారు. పీఏ సీఎస్‌ చైర్మన్‌ లక్కినేని సు రేందర్‌రావు క్వింటా బా ధితులకు బియ్యం, దుస్తు లను అందించారు. 


Updated Date - 2020-12-03T04:04:53+05:30 IST