వేటగాల్ల ఉచ్చులోపడి ఎలుగుబంటి మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:08:19+05:30 IST

వేటగాళ్ళు వలపన్ని ఎలుగుబంటిని చంపి మర్మాంగాలను,గోర్లను కోసి తీసుకెళ్ళిన సంఘటన గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో చోటుచేసుకుంది.

వేటగాల్ల ఉచ్చులోపడి ఎలుగుబంటి మృతి
మృతి చెందిన ఎలుగుబంటి

 ఎలుగుబంటి మర్మాంగాలను,గోర్లను కోసుకెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు                          

గన్నేరువరం,జనవరి 15ః వేటగాళ్ళు వలపన్ని ఎలుగుబంటిని చంపి మర్మాంగాలను,గోర్లను కోసి తీసుకెళ్ళిన సంఘటన గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మైలారం గ్రామ శివారులోని మల్లిఖార్జునస్వామి ఆలయసమీపంలోని గుట్టవద్ద శుక్రవారం మృతిచెంది ఉన్న ఎలుగుబంటిని గొర్లకాపరులు చూసి గ్రామస్థులకు విషయాన్ని తెలపడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రదేశాన్ని గుర్తించిన వేటగాళ్ళు వలపన్ని అది తిరిగేచోట జిలెటన్‌స్టిక్‌ ఉంచడంతో దానిని నోటితో తెరిచే ప్రయత్నంలో జిలెటన్‌స్టిక్‌ పేలి ఎలుగుబంటి మృతి చెందినట్లు గుర్తించారు.మృతి చెందిన ఎలుగుబంటి మర్మాంగాలను,గోర్లను వేటగాళ్ళు కోసి తీసుకెళ్ళినట్లు స్థానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ దుడ్దు రేణుక,నాయకులు మల్లేశం ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని అక్కడే పోస్ట్‌మార్టం చేసి గుంతలో పూడ్చిపెట్టడం జరిగింది.అడవిపందుల కోసం వేటగాళ్ళు వేసిన ఉచ్చులోపడి ఎలుగుబంటి మృతి చేందడంతో వన్యప్రాణులను రక్షించేందుకు ప్రత్యేక నిఘాను పెట్టాలని నాయకులు దుడ్డు మల్లేశం అటవీశాఖ అధికారులను కోరారు.         

Updated Date - 2021-01-16T05:08:19+05:30 IST