వృద్ధురాలి ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2021-03-01T07:02:43+05:30 IST

వృద్ధురాలి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.

వృద్ధురాలి ఇంట్లో  చోరీ

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వృద్ధురాలి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 10 అచ్యుత సొసైటీలో నివసిస్తున్న శేషమణి అనే వృద్ధురాలు నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లారు. ఇంటి సంరక్షణ బాధ్యతను ప్రశాసన్‌నగర్‌లో ఉంటున్న బంధువు రామిరెడ్డి శ్రీనివా్‌సకు అప్పగించారు. ఇంటి బయట పనిమనిషి శ్రీదేవి వారానికి రెండు రోజులు శుభ్రం చేస్తోంది. ఫిబ్రవరి 27న ఇంటి ఆవరణను శుభ్రం చేసేందుకు శ్రీదేవి వెళ్లింది. తలుపులు పగులగొట్టి ఉండట గమనించి రామిరెడ్డి శ్రీనివా్‌సకు చెప్పింది. ఆయన బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శేషమణి అమెరికాలో ఉండటంతో ఇంట్లో చోరీ అయిన వస్తువుల వివరాలు తెలియరాలేదు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-01T07:02:43+05:30 IST