gangsterతో కలిసి హుక్కా తాగిన క్రైంబ్రాంచ్ ఇన్‌స్పెక్టర్...సస్పెండ్

ABN , First Publish Date - 2022-04-25T18:08:35+05:30 IST

ఓ గ్యాంగ్‌స్టర్‌తో హుక్కా తాగినందుకు క్రైమ్ బ్రాంచ్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది....

gangsterతో కలిసి హుక్కా తాగిన క్రైంబ్రాంచ్ ఇన్‌స్పెక్టర్...సస్పెండ్

ఉత్తరప్రదేశ్: ఓ గ్యాంగ్‌స్టర్‌తో హుక్కా తాగినందుకు క్రైమ్ బ్రాంచ్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. కాన్పూర్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ అంకిత్ లాలాతో క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఆసిఫ్ హుక్కా తాగుతున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.దీంతో పోలీసు అధికారి ఆసిఫ్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.విషయం తెలుసుకున్న కాన్పూర్ పోలీసు జాయింట్ సీపీ ఆనంద్ ప్రకాష్ తివారీ విచారణకు ఆదేశించారు.‘‘ఈ సంఘటన మా దృష్టికి వచ్చింది. సంబంధిత అధికారి ఆసిఫ్ ను సస్పెండ్ చేసి పోలీస్ లైన్ కు అటాచ్ చేశాం. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీ కూడా వేశాం’’ అని తివారీ చెప్పారు.


సమాజ్‌వాదీ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో క్రిమినల్ తో కలిసి హుక్కా తాగుతున్న పోలీసు అధికారి చిత్రాన్ని పోస్టు చేసింది. ‘‘క్రైమ్ బ్రాంచ్ అధికారి నేరస్థులతో హుక్కా తాగుతుంటే, యూపీలో నేరాలు ఎలా ఆగుతాయి? కాన్పూర్‌లో ఒక నేరస్థుడితో క్రైమ్ బ్రాంచ్ అధికారి హుక్కా తాగుతున్న ఫోటో వైరల్ కావడం పోలీసు శాఖకు మచ్చ. పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలి.’’ అని సమాజ్ వాదీపార్టీ కోరింది.


Updated Date - 2022-04-25T18:08:35+05:30 IST