తరుణ్‌భాస్కర్ దాస్యం దర్శకుడిగా నూతన చిత్రం ఖరారైంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కీడా కోలా’ అనే టైటిల్‌ను ఖాయం చేశారు. వీజీ సైన్మా పతాకంపై భరత్‌కుమార్, శ్రీపాద్ నందిరాజ్ తదితరులు నిర్మిస్తున్నారు. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది.