నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-08-19T06:10:16+05:30 IST

నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే పిలుపు నిచ్చారు.

నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

- ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 18: నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే పిలుపు నిచ్చారు. గురువారం  జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల సంఖ్యను తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపడుతూ కోర్ట్‌ డ్యూటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కోర్టు ట్రయల్‌కు ఎప్పటికప్పుడు హాజరవ్వలాన్నరు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల పట్ల త్వరగా స్పందించి చార్జిషీట్‌లు వేసి అరవై రోజులలో కోర్టుకు సమర్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, పాత కేసులలో వేగవంతంగా దర్యాప్తు పూర్తిచేయాలన్నారు. ఎఫ్‌ ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌లు పెండింగ్‌ ఉండడం కారణంగా కేసులు సత్వరంగా కోర్టుకు సమర్పించకలేకపోవడం వల్ల దర్యాప్తులో జాప్యం అవుతుందన్నారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచి దొంగతనాల కేసులలో టెక్నాలజీ ఉపయోగించి కేసులను ఛేదించాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌, ప్రోయాక్టివ్‌ పోలీసింగ్‌ పద్ధతులను అవలంభించి గస్తీ వాహనాలను ఎల్లవేళలా ప్రజా రద్దీగా ఉండే ప్రాంతాల్లో, కూడళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో ఏకీకృత సేవలను విస్తరింప చేయడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫంక్షనల్‌ వర్టికల్స్‌ అమలు తీరును బాగుండాలన్నారు. ఈ సందర్భంగా ఫంక్షనల్‌ వర్టికల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అఽధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఎస్‌. వెంకటేశ్వర్లు (ఎస్‌ఐ), అభిలాష్‌, (ఎస్‌ఐ)  రాజు (ఆర్‌ఎస్‌ఐ),  మల్లయ్య(ఎఎస్‌ఐ), కానిస్టేబుల్స్‌ లతీఫ్‌,  మహేందర్‌,  రాజేందర్‌,  కిషన్‌రావు, జగన్‌, తిరుపతి, రమణారెడ్డి,  భూమయ్య, అశోక్‌, లక్‌పతి, అనిల్‌ ఎస్పీ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.


Updated Date - 2022-08-19T06:10:16+05:30 IST