మూడు కార్లు ఢీ : పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2020-11-27T04:33:33+05:30 IST

ఎదురెదురుగా మూడు కార్లు ఢీకొనడంతో పలువురికి గాయాలైన సంఘటన మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

మూడు కార్లు ఢీ : పలువురికి గాయాలు
జాతీయ రహదారిపై ఢీకొన్న కార్లు

రాజాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఘటన



రాజాపూర్‌, నవంబరు 26 : ఎదురెదురుగా మూడు కార్లు ఢీకొనడంతో పలువురికి గాయాలైన సంఘటన మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై లెనిన్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై సూర్యజ్యోతి పరిశ్రమ దగ్గర కర్నూ ల్‌ నుంచి హైదారాబాద్‌ వైపు వెళ్తున్న కారును, మరో కారును హైదారా బాద్‌ నుంచి రాజాపూర్‌ వైపు వస్తున్న కారు ఎదురుగా ఢీకొట్టడంతో కర్నూల్‌ నుంచి హైదారాబాద్‌ వైపు వెళ్తున్న కార్లలో ప్రయాణిస్తున్న వారికి గాయాలైనట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి  వస్తున్న కారును డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘటన జరిగిందని, సదరు కారు డ్రైవరుపై చర్యలు తీసుకొని తమ నాయ్యం చేయాలని కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు యజమాని వెంకటరమేష్‌ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ  ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడ ఉన్నవరందరు ఉపీరి పిల్చుకున్నారు. జాతీయ రహదారిపై కిలో మీటరు మేరకు వాహనాలు జమ్‌ కవడంతో స్థానిక పోలీసులు తగ్గు చర్యలు తీసుకోని వాహాదారులకు ఏలాంటీ ఇబ్బందులు కల్గుకుండా చర్యలు తీసుకున్నారు.


ఇసుక తరలిస్తున్న ట్రాక్టరు సీజ్‌

రాజాపూర్‌, నవంబరు 26 : మండల కేంద్రంలోని స్థానిక దుందుభీ వాగులో నుంచి గురువారం తెల్లవారుజామున కృత్రిమ ఇసుక తయారు చేస్తున్న ఎక్స్‌కావేటర్‌, ట్రాక్టరును సీజ్‌ చేసినట్లు స్థానిక ఎస్సై లెనిన్‌ గౌడ్‌ తెలిపారు. సీజ్‌ చేసిన వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా కృత్రిమ ఇసుక తయారు చేసినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.


మతిస్థిమితం లేని మహిళ బావిలో పడి మృతి 

గండీడ్‌, నవంబరు 26 : మతిస్థిమితంలేని ఓ మహిళ బావిలో పడి ఆత్మహత్యచేసుకొ మృతి చెందిన సంఘటన దేశాయిపల్లిలో జరిగింది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన కుర్వ సత్యమ్మ (55) కొంత కాలం నుంచి మతిస్థిమితం సరిగా లేకుండా అటుఇటు తిరిగేది. దీంతో ఈనెల 24న రాత్రి ఇంట్లో నిద్రించి తెల్లవారుజామున వెళ్లి పోయింది. బుధవారం కుటుంబీకుల దగ్గర వెతకగా గురువారం తెల్లవారు జామున గ్రామసమీపంలో గల దొంగల గోపాల్‌ బావిలో హృతదేహం కన్పించింది. దీంతో మృతురాలి కొడుకు కుర్వ మల్లేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు.


మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య 

గండీడ్‌, నవంబరు 26 : ఇంటి సంసార విషయంలో ఇంట్లో గొడవపడి మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాలు... వెన్నాచెడ్‌ గ్రామానికి చెందిన కామన్‌పల్లి రాములు (55) ఈనెల 20న గొర్రెల విషయంలో కుటుంబీకులతో గొడవపడి ఇంట్లోనుంచి  మధ్యాహ్నం వెళ్లిపోయాడు. రెండురోజులు ఇంటికి తిరిగిరా లేకపోయాడు. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆచూకీ కోసం వెతకగా గురువారం కప్లాపూర్‌ గ్రామశివారులో శవమైక న్పించాడు. మృతుడి కుమారుడు కామన్‌పల్లి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


గుండెపోటుతో వ్యక్తి మృతి

హన్వాడ, నవంబరు 26 : మండలంలోని పల్లెమోని కాలనీ సమీపంలో ఉన్న రైస్‌ మిల్లులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రాజు (27)అనే వ్యక్తి  రైస్‌ మిల్‌ ఆపరేట ర్‌గా పనిచేస్తుండేవాడు. గురువారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతిచెందినట్లు తెలిసింది. అతని మృతిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి మృతి చెందినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైస్‌మిల్‌ యజమానిని వివరణ కోరగా గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు మత్రం తమకు ఎలాంటి సమా చారం లేదని తెలిపారు.

Updated Date - 2020-11-27T04:33:33+05:30 IST