రైల్లోంచి పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-11-29T06:27:30+05:30 IST

ముదిగుబ్బకు చెందిన సోంపల్లిప్రకాశ్‌(31) రైలు నుం చి జారిపడి మృతిచెందిన సంఘటన శనివారం ధర్మవరం సమీపంలోని గుట్టకిందపల్లి వద్ద చోటుచేసుకుంది.

రైల్లోంచి పడి యువకుడి మృతి

ధఽర్మవరంఅర్బన్‌, నవంబరు 28: ముదిగుబ్బకు చెందిన సోంపల్లిప్రకాశ్‌(31) రైలు నుం చి జారిపడి మృతిచెందిన సంఘటన శనివారం ధర్మవరం సమీపంలోని గుట్టకిందపల్లి వద్ద చోటుచేసుకుంది. ముదిగుబ్బకు చెందిన శ్రీ రాములు కుమారుడు  సోంపల్లిప్రకాశ్‌ ముదిగుబ్బలో కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటూ జీవ నం సాగించేవాడు. ప్రకాశ్‌ గుంతకల్లుకు తన మేనమామ ఇంటికి వెళ్లి తిరిగి రైలులో ముదిగుబ్బకు బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో ధర్మవరం సమీపంలోని గుట్టకిందపల్లికి వద్దకురాగానే ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి కిందకు పడ్డాడు. రైల్వేకీమన్‌ స్టేషన్‌ మాస్టర్‌, రైల్వేఎ్‌సఐలకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి 108ద్వారా ప్రకాశ్‌ను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రకాశ్‌ను అనంతపురం  ఆస్పత్రికి తరలించగా అక్క డ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు రైల్వేపోలీసులు తెలిపారు.  స్టేషన్‌ మాస్టర్‌ప్రకాశ్‌ బంధువులకు సమాచారం అందించారు. రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు ప్రకాశ్‌ అవి వివాహితుడని బంధువులు తెలిపారు. 


చదువు మానేయమన్నారని విద్యార్థిని ఆత్మహత్య 

గోరంట్ల, నవంబరు 28: పట్టణంలోని శివాలయం కాలనీకి చెందిన భజంత్రి మంజుళ(21) అర్ధాంతరంగా చదువుమానేయమన్నందుకు మనస్థాపం చెంది శనివారం ఆత్మహత్య చేసుకుంది. టైలర్‌ వెంకటేశులు కు మార్తె మంజుళ డిగ్రీ పూర్తి చేసి ఎం బీఏ చదవాలని ముచ్చటపడింది. అయి తే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం చదువు మాన్పించి  పెళ్లి చేయాలని చర్చించుకోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైందని బంధువులు తెలిపారు. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయంలో పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వంశీకృష్ణ కేసు నమోదుచేసి శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.


గుండెపోటుతో రైతు మృతి 

నల్లమాడ, నవంబరు 28: మండల కేంద్రంలో గంగా థియేటర్‌ సమీపంలో నివాసముంటున్న రైతు కుళ్ళాయప్ప (77) శనివారం గుం డెపోటుతో మృతి చెందారు. ఇంటిలో ఉన్నఫలంగా కుళ్ళాయప్పకు ఛాతిలో నొప్పి రావడంతో నల్లమాడ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రైతు మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతునికి భార్య శేషమ్మ, ఇద్దరుకు మారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని గ్రామస్థులు, బంధువులు కోరారు. 


రోడ్డు ప్రమాదంలో ఒకరు..

నల్లమాడ, నవంబరు 28: మండలంలోని రామాపురం సమీపాన శుక్రవారం  రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో చంద్ర (28) మృతి చెందినట్లు ఎస్‌ఐ శరత్‌ చంద్ర తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు బొగ్గలపల్లి గ్రామానికి చెందిన చంద్ర నల్లమాడ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, సానేవారిపల్లికి చెందిన లక్ష్మీనారాయణ కదిరి నుంచి ద్విచక్రవాహనంలో వస్తూ రామాపురం వద్ద ఎదురెదురుగా ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో చంద్ర తీవ్రం గా గాయపడ్డాడు. అతనికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చంద్ర మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2020-11-29T06:27:30+05:30 IST