ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2020-07-05T10:21:24+05:30 IST

పంచాయతీకి కేటాయించిన స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌జైన్‌ అన్నారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు

శంకర్‌పల్లి: పంచాయతీకి కేటాయించిన స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌జైన్‌ అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని పరిధిలోని మోకిలాలో వెంచర్లను, డంపింగ్‌యార్డు స్థలాలను డీపీవో పద్మజారాణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంచర్లల్లో పంచాయతీలకు కేటాయించిన 10శాతం స్థలాలను కబ్జా చేస్తే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామ న్నారు. మున్సిపాలిటి, పంచాయతీ పరిధిలో ఉన్న వెంచర్లల్లో 10శాతం భూమిని పంచాయతీ పేరిట రిజిస్టేషన్‌ చేయించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-07-05T10:21:24+05:30 IST