కిలాడి లేడీ లవ్ స్టోరీ.. ఒకటి కాదు ఇద్దరు గ్యాంగ్‌స్టర్లతో ప్రేమయాణం.. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందంటే..

ABN , First Publish Date - 2022-01-27T06:06:01+05:30 IST

ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. త్వరగా డబ్బు సంపాదించాలని.. మంచి విలాసవంతమైన జీవితం గడపాలని ఆమె తప్పుడుదారిలో వెళ్లింది. ముందు ఒక గ్యాంగ్‌స్టర్‌‌ను ప్రేమించింది. అతని వద్ద నుంచి బాగా డబ్బు సంపాదించింది. ఆ తరువాత అతని స్నేహితుడితో కూడా ప్రేమ వ్యవహారం నడిపింది..

కిలాడి లేడీ లవ్ స్టోరీ.. ఒకటి కాదు ఇద్దరు గ్యాంగ్‌స్టర్లతో ప్రేమయాణం.. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందంటే..

ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. త్వరగా డబ్బు సంపాదించాలని.. మంచి విలాసవంతమైన జీవితం గడపాలని ఆమె తప్పుడుదారిలో వెళ్లింది. ముందు ఒక గ్యాంగ్‌స్టర్‌‌ను ప్రేమించింది. అతని వద్ద నుంచి బాగా డబ్బు సంపాదించింది. ఆ తరువాత అతని స్నేహితుడితో కూడా ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ విషయం మొదటి గ్యాంగ్‌స్టర్‌కు తెలియగానే ప్లేటు ఫిరాయించింది. దీంతో ఆ మొదటి గ్యాంగ్‌స్టర్‌ తన గర్లఫ్రెండ్ కోసం స్నేహితుడిని కాల్చి చంపేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని కరోలీ నగరానికి చెందిన రేఖ(19) చిన్నప్పటి నుంచి దురుసుగా ఉండేది. జీవితంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంలో ఇల్లు వదిలి జైపూర్ వచ్చింది. అక్కడ కరోలీ నగరానికి చెందిన అనురాజ్ అనే గ్యాంగ్‌స్టర్ చెంతకు చేరింది. ఇద్దరూ ఒకే నగరం వారు కావడంతో త్వరగా అనురాజ్ గ్యాంగ్‌లో సభ్యురాలు అయిపోయింది. ఆ తరువాత అనురాజ్ ఆమె అందం చూసి ప్రేమించాడు. రేఖ గ్యాంగ్‌లో ఉండి బడా బిజినెస్‌మెన్లను బెదిరించి డబ్బులు వసూలు చేసేది. ఆమెకు భయం అంటే ఏంటో తెలియదు. సోషల్ మీడియాలో నేరుగానే బడా బాబులకు బెదిరింపులు ఇచ్చేది. 


అలా అనురాజ్ గ్యాంగ్‌లో ఒక స్థాయికి చేరుకున్నాక.. ఒకసారి అనురాజ్ స్నేహితుడు పప్పుతో పరిచయం ఏర్పడింది. పప్పుకు మరొక గ్యాంగ్ ఉండేది. కొంతకాలం తరువాత ఒకరోజు అనురాజ్‌కు పప్పు, రేఖల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిసింది. ఈ విషయం రేఖను అనురాజ్ అడిగాడు. అప్పుడు రేఖ ప్లేటు ఫిరాయించింది. పప్పు తనతో బలవంతం చేస్తున్నాడని చెప్పింది. ఇది విన్న అనురాజ్ కోపం పట్టలేక.. నేరుగా పప్పు ఇంటికి వెళ్లి స్నేహితుడని కూడా చూడకుండా తుపాకీతో కాల్చి చంపాడు.


ఆ తరువాత పప్పు హత్య కేసులో పోలీసులు అనురాజ్ కోసం వెతుకుతుండగా.. అతను పరారయ్యాడు. కానీ పోలీసుల విచారణలో రేఖ గురించి తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. 


Updated Date - 2022-01-27T06:06:01+05:30 IST