క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌

ABN , First Publish Date - 2021-05-08T17:15:20+05:30 IST

శనగపిండి - 200గ్రా, బేకింగ్‌ పౌడర్‌ - 10గ్రా, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 10గ్రా, హంగ్‌ కర్డ్‌ - 150గ్రా, ఎండుద్రాక్ష - 20గ్రా, జీడిపప్పు - 20గ్రా, డేట్స్‌ - 50గ్రా, కొత్తిమీర - 15గ్రా, వాము -

క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌

కావలసినవి: శనగపిండి - 200గ్రా, బేకింగ్‌ పౌడర్‌ - 10గ్రా, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 10గ్రా, హంగ్‌ కర్డ్‌ - 150గ్రా, ఎండుద్రాక్ష - 20గ్రా, జీడిపప్పు - 20గ్రా, డేట్స్‌ - 50గ్రా, కొత్తిమీర - 15గ్రా, వాము - 5గ్రా, పసుపు - 10గ్రా, నూనె - సరిపడా, బ్రెడ్‌ ప్యాకెట్‌ - ఒకటి.


తయారీ విధానం: ఒక పాత్రలో శనగపిండి తీసుకుని అందులో బేకింగ్‌ పౌడర్‌, హంగ్‌ కర్డ్‌, ఎండుద్రాక్ష , జీడిపప్పు, డేట్స్‌, వాము, కొత్తిమీర, వాము, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి పలుచని మిశ్రమంలా కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలను సెనగపిండి మిశ్రమంలో డిప్‌ చేసి, నూనెలో వేసి వేగించుకోవాలి. ముదురు  గోధుమవర్ణంలోకి మారే వరకు డీప్‌ ఫ్రై చేయాలి. కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేసుకుంటే క్రిస్పీ కర్డ్‌ రోల్స్‌ రుచికరంగా ఉంటాయి. 


ఎండి షాహిద్‌ హుస్సేన్‌, ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌, తాజ్‌ కృష్ణ, హైదరాబాద్‌


Updated Date - 2021-05-08T17:15:20+05:30 IST