అభివృద్ధి చూసి ఓర్వలేకనే విమర్శలు

ABN , First Publish Date - 2022-05-14T05:30:00+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువ య్య, పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌లు మండిపడ్డారు

అభివృద్ధి చూసి ఓర్వలేకనే విమర్శలు
దండేపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

దండేపల్లి, మే 14: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువ య్య, పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌లు మండిపడ్డారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబం ధు, బీమా, దళిత బంధు, 24 గంటల విద్యుత్‌ సరఫరా ఇస్తుందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్‌, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళే పరిస్థితి నెలకొందన్నారు. దళితబంధుపై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచా రం చేస్తున్నారని, ఏ పథకం ప్రారంభించినా విడుతల వారీగా అమలు చేస్తామ న్నారు. వెల్గనూర్‌లో బీజేపీ నాయకులకు సైతం దళిత బంధు వర్తింప జేసింది  నాయకులకు కనిపించడం లేదని మండిపడ్డారు. మాజీ ఎంపీపీ మల్లేష్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షకార్యదర్శి నరేష్‌, సంతోష్‌,  సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-14T05:30:00+05:30 IST