ఇంట్లోకి చొరబడిన మొసలి పట్టివేత

ABN , First Publish Date - 2021-11-09T15:08:46+05:30 IST

ఇంటిలోకి వచ్చిన మెసలిని అటవీశాఖ సిబ్బంది బంధించారు. కడలూరు జిల్లా భువనగిరి సమీపం ఆదివారాగనత్తం ప్రాంతానికి చెందిన కుమార్‌ శనివారం అర్ధరాత్రి వేళ ఇంటి వెనుకకు వెళ్లగా వంట గది

ఇంట్లోకి చొరబడిన మొసలి పట్టివేత

ఐసిఎఫ్‌(చెన్నై): ఇంటిలోకి వచ్చిన మెసలిని అటవీశాఖ సిబ్బంది బంధించారు. కడలూరు జిల్లా భువనగిరి సమీపం ఆదివారాగనత్తం ప్రాంతానికి చెందిన కుమార్‌ శనివారం అర్ధరాత్రి వేళ ఇంటి వెనుకకు వెళ్లగా వంట గది నుంచి వింత శబ్దాలు రావడం గమనించాడు. లైటువేసి చూడగా మొసలి కనిపించడంతో బెంబేలెత్తాడు. ఈ విషయాన్ని చిదంబరం అటవీశాఖ కార్యాలయానికి సమాచారం అందించగా, సిబ్బంది అక్కడకు చేరుకొని సుమారు 5 అడుగుల పొడవున్న మొసలిని బంధించి, చిదంబరం సమీపంలోని వక్కారమారి చెరువులో వదలిపెట్టారు.


Updated Date - 2021-11-09T15:08:46+05:30 IST