Viral Video: నీళ్లు తాగేందుకు వచ్చిన పిల్ల ఏనుగు.. మెల్లిగా వచ్చి కాలు పట్టేసుకున్న మొసలి.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-21T21:52:34+05:30 IST

ఏనుగు తన పిల్లను కాపాడుకునేందుకు మొసలితో తలపడే సన్నివేశం వీక్షకులను ఆకట్టుకుంటోంది. జాంబియాలోని జాంబేజీ నది ఒడ్డున నీరు తాగేందుకు ఏనుగుల మంద వచ్చింది. అన్నీ నీరు తాగి వెళ్తున్నాయి. ఈ క్రమంలో

Viral Video: నీళ్లు తాగేందుకు వచ్చిన పిల్ల ఏనుగు.. మెల్లిగా వచ్చి కాలు పట్టేసుకున్న మొసలి.. చివరకు ఏం జరిగిందంటే..

ఏనుగులు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలుసు. అందుకే వాటి జోలికి వెళ్లేందుకు మిగతా జంతువులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి. ఒక్కోసారి ఏనుగులకు కోపం వచ్చిన సందర్భాల్లో బీభత్సం సృష్టిస్తుంటాయి. మరి అలాంటిది.. దాని పిల్లల జోలికి వళ్తే ఊరుకుంటాయా.. ఆఫ్రికాలో ఇలాగే ఓ మొసలి, ఏనుగుతో పెట్టుకుంది.. ఏనుగు, మొసలి ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


ఏనుగు తన పిల్లను కాపాడుకునేందుకు మొసలితో తలపడే సన్నివేశం వీక్షకులను ఆకట్టుకుంటోంది. జాంబియాలోని జాంబేజీ నది ఒడ్డున నీరు తాగేందుకు ఏనుగుల మంద వచ్చింది. అన్నీ నీరు తాగి వెళ్తున్నాయి. ఈ క్రమంలో చివరగా ఉన్న ఏనుగు పిల్లపై మొసలి దాడి చేసింది. దాని కాలు పట్టుకుని లాగేందుకు ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన తల్లి ఏనుగు.. మొసలి నుంచి తన పిల్లను విడిపించుకుంది. అనంతరం మొసలిని ఓ ఆట ఆడుకుంది. దాని తొండం దాటికి మొసలికి చుక్కలు కనపడ్డాయి.


ఏనుగు నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా మొసలి వల్ల కాలేదు. చివరకు ఏనుగు చేతిలో ప్రాణాలు వదిలింది. అయినా ఏనుగు మాత్రం.. దాన్ని వదల్లేదు. కాలితో తొక్కుతూ, తొండంతో అటూ ఇటూ కదిపింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని ఓ పర్యాటకుడు తన కెమెరాలో చిత్రీకరించాడు. ఈ వీడియోను చూసిన వారంతా తల్లి ఏనుగును తెగ మెచ్చుకుంటున్నారు.



Updated Date - 2021-10-21T21:52:34+05:30 IST