ltrScrptTheme3

చేపలు పట్టడానికి వెళ్లిన బుడతడికి అనుకోకుండా మొసలి ఎదురైంది.. ఆ తరువాత ఏం జరిగిదంటే

Oct 6 2021 @ 06:43AM

సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన ఓ చిన్న కుర్రాడికి అనుకోకుండా మొసలి ఎదురైంది.  చేపను నీటి నుంచి తీస్తున్న చివరి నిమిషంలో ఆ మొసలి ఒక్కసారిగా చేప వెంటే ఒడ్డున వచ్చింది. అది చూసిన ఆ కుర్రాడు పెద్ద కేకలు వేస్తూ పరుగు పట్టాడు. ఈ సన్నివేశమంతా ఆ కుర్రాడి తండ్రి వీడియో తీశాడు. ఇప్పుడా వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.


అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన షాన్ మెక్‌మెహోన్ తన కొడుకు డాసన్‌ని సరదాగా చేపలు పట్టడానికి(ఫిషింగ్) తీసుకెళ్లాడు. డాసన్ చేపలు పడుతుండగా వెనుకనుంచి షాన్ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. కొంత సమయం తరువాత డాసన్ ఫిషింగ్ రాడ్‌కి చేప చిక్కింది, దాన్ని ఎంతో కష్టపడి ఆ చిన్నవాడు ఒడ్డుకి లాగాడు. అంతలోనే అకస్మాత్తుగా ఒక మొసలి ఆ చేపను వెంబడిస్తూ ఒడ్డున చేరి చేపను నోట బెట్టుకొంది. ఇది చూసిన డాసన్ పెద్ద కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగెత్తాడు. ఆ మొసలి మాత్రం ఆ చేపను మింగబోయి అతని ఫిషింగ్ రాడ్‌ని సైతం నీటిలోకి తీసుకెళ్లింది.


ఇదంతా వెనుక నుంచి వీడియో రికార్డ్  చేస్తున్న డాసన్ తండ్రి షాన్ ఒళ్లు జలదరించి ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ వీడియోని తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియోకి వేల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.