యాసంగికి సమాయత్తం

ABN , First Publish Date - 2020-10-15T07:48:38+05:30 IST

యాసంగి సాగుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంట లు సాగుకానున్నాయి

యాసంగికి సమాయత్తం

జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా     

ఎరువుల అవసరాలపై ప్రణాళికలు రెడీ


కామారెడ్డి, అక్టోబరు 14: యాసంగి సాగుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంట లు సాగుకానున్నాయి. ఏ మేరకు ఎరువులు, విత్తనాలు అవసరం పడ నున్నాయో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ యాసంగిలో జిల్లాలో 3.50లక్షల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగు కానున్నా యి. ఇందుకు అవసరం కానున్న ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక వానా కాలంలో వరుణుడు కరుణించడంతో పుష్కలంగా వర్షాలు కురువడంతో రికార్డుస్థాయిలో పంటలు పండనున్నాయి. ప్రభుత్వం చెప్పిన విధంగానే చాలా వరకు రైతులు నియంత్రిత సాగు విధానాన్ని పాటించారు. ఈ క్రమంలో రైతులు ఇబ్బంది పడకుండా గ్రామాల్లోనే వాటి కొనుగోళ్లకు సైతం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.


జిల్లాలో 3.50లక్షల ఎకరాలకు పైగానే సాగు అంచనా

కామారెడ్డి జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకుపైగానే రైతులు పంటలు సాగు చేస్తారని తెలుస్తోంది. వరి, పత్తి, సోయా, కందులతో పాటు కొన్నిచోట్ల మొక్కజొన్న పంట సాగు కానున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. భూ గర్భజలాలు పెరగడంతో బోరుబావుల్లోకి నీరు వచ్చాయి. అన్ని బావుల్లో నీటి ఊటలు పెరగడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే యాసంగి సాగుపై రైతులు ఉత్సాహంగా ఉన్నారు. వానాకాలంలో పత్తి, వరి, సోయా, మొక్కజొన్న పంటలు పెద్దఎత్తున సాగు చేశారు. భారీ వర్షాలతో పత్తి కొంత నష్టం వాటిళ్లినప్పటికీ రైతుల ఆశలు మాత్రం పత్తిపైనే ఉన్నాయి.


గ్రామాల్లోనే వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు

వానా కాలంలో పండించిన పంటల అమ్మకాలకు రైతులు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లోనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఐకేపీ, పీఏసీ ఎస్‌ల ద్వారా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాగు పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు అమ్మిన తర్వాత నేరుగా రైతు ల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నారు. గ్రామా ల్లోనే వడ్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించడంతో రైతుల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-10-15T07:48:38+05:30 IST