పంట కాలువలు కనుమరుగు

ABN , First Publish Date - 2022-06-30T05:07:17+05:30 IST

మండలంలోని చెరువులు, పంట కాలువలు రోజురోజుకు ఆక్రమణకు గురవుతున్నాయి. వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకునేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా తయా రైంది. వివరాల్లోకెళితే... నందలూరు బస్టాండు కూడలి నుంచి రైల్వేస్టేషన్‌ వెళ్లే రోడ్డులో చెయ్యేరు వైపు నుంచి కన్యకా చెరువు వైపుగా 9 చిన్న పంట కాలువలు, ఒక ప్రధాన కాలువ (కయ్యం కాలువ) ఉన్నాయి.

పంట కాలువలు కనుమరుగు
కయ్యం కాలువపై నిర్మాణాలు చేపట్టిన దృశ్యం

కాలువపై బ్రిడ్జి ఏర్పాటు 

రూములు నిర్మించి అద్దెకు

నందలూరు, జూన్‌ 29: మండలంలోని చెరువులు, పంట కాలువలు రోజురోజుకు ఆక్రమణకు గురవుతున్నాయి. వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకునేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా తయా రైంది. వివరాల్లోకెళితే... నందలూరు బస్టాండు కూడలి నుంచి రైల్వేస్టేషన్‌ వెళ్లే రోడ్డులో చెయ్యేరు వైపు నుంచి కన్యకా చెరువు వైపుగా 9 చిన్న పంట కాలువలు, ఒక ప్రధాన కాలువ (కయ్యం కాలువ) ఉన్నాయి. కయ్యం కాలువ చెయ్యేరు నుంచి కడప-తిరుపతి హైవే రోడ్డుకు పక్కనున్న కన్యకా చెరువులోకి నీరు వెళుతుంది. గతంలో ఈ కాలువ 30-40 అడుగుల రోడ్డుతో పాటు కాలువ పక్కన ఓ ఎడ్ల బండి వెళ్లేందుకు కాలువ పోరంబోకు స్థలం ఉండేది. కానీ నేడు ఈ కాలువ 10 అడుగులు కూడా లేదంటే కాలువ పొడవునా ఏ స్థాయిలో ఆక్రమణలు చేశారో ఇట్టే అర్థం అవుతోంది. ఈ కాలువపై కొందరు ఏకంగా ఇంటి నిర్మాణాలు చేపడితే మరికొందరు దారి కోసం బ్రిడ్జి ఏర్పాటు చేసి దానిపై తాత్కాలిక భవనాలు నిర్మించి అద్దెలకు ఇచ్చుకోవడం గమనార్హం. 

అంతేకాకుండా ఆర్‌.ఎస్‌.రోడ్డులోని చెయ్యేరు వైపు నుంచి కన్యకాచెరువు వైపుగా తొమ్మిది పంట కాలువలు ఉండేవి. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మాటున ఇంటి నిర్మాణాల పేరుతో యఽథేచ్చగా ఆక్రమించేశారు. దీంతో పాటు తమకున్న అధికార బలంతో కాలువపై పంచాయతీ నిధులతో తమ ఇళ్లకు వెళ్లేందుకు సైతం బ్రిడ్జి వేయించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఆర్‌.ఎ్‌స.రోడ్డు నిర్మాణ సమయంలో ఈ కాలువలపై ఉన్న కల్వర్టును సైతం కాంట్రాక్టర్లు కూల్చివేసి రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో నేడు ఈ కాలువలన్నీ మాయమయ్యాయి. వర్షాలు పడినా, చెయ్యేరులో నీరు ప్రవహిస్తున్నా ప్రధాన కాలువ, పంట కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహించేవి. ఈ కాలువ లన్నీ ఆక్రమణకు గురికావడంతో వర్షాకాలంలో ప్రతి ఏడాది నీలిపల్లె రోడ్డు, విద్యానగర్‌, గణేష్‌ నగర్‌ ప్రాంతాల్లోని 300 ఇళ్లు నీటమునుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆక్రమణలకు గురైన పంట కాలువలను పునఃరుద్ధరించి ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. 


కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

కన్యకా చెరువు ప్రధాన కాలువ అయిన కయ్యం కాలువ రోజు రోజుకు ఆక్రమణకు గురవుతోంది. సంబంధిత మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వర్షాల సమయంలో, చెయ్యేరు పొం గినప్పుడు తీవ్ర ఇబ్బందిగా ఉంటోం ది. దీనిపై త్వరలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. 

- మస్తానయ్య, నందలూరు

Updated Date - 2022-06-30T05:07:17+05:30 IST