లెక్కతేలింది..!

ABN , First Publish Date - 2021-12-04T06:49:48+05:30 IST

జిల్లా లో తుఫాన ప్రభావిత పంటనష్టం లెక్క ఎట్టకేలకు తేలిం ది. జిల్లా వ్యాప్తంగా పంటనష్టంపై వ్యవసాయ అధికారు లు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తి చేశారు.

లెక్కతేలింది..!

పంట నష్టంపై క్షేత్ర స్థాయి సర్వే పూర్తి

1,11,786 హెక్టార్లలో పంట నష్టం అంచనా 

అత్యధికంగా 81915 హెక్టార్లల్లో పప్పుశనగ నష్టం

నేటి నుంచి ఆర్బీకేల్లో రైతుల జాబితా ప్రదర్శన

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 3 : జిల్లా లో తుఫాన ప్రభావిత పంటనష్టం లెక్క ఎట్టకేలకు తేలిం ది. జిల్లా వ్యాప్తంగా పంటనష్టంపై వ్యవసాయ అధికారు లు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వే  పూర్తి చేశారు. ఇటీవల  కలెక్టరేట్‌లో జిల్లాఇనచార్జి మంత్రి బొత్ససత్యనారాయణ సమీక్షా సమావేశంలో అధిక వర్షాలకు జరిగిన పంట న ష్టంపై ప్రాథమిక అంచనాలను వ్యవసాయశాఖ నివేదిం చింది.  భారీవర్షాలు కురిసిన ప్రాంతాల్లో 46401 హెక్టార్ల ల్లో పప్పుశనగ, వరి, వేరుశనగ, పెసర తదితర పంటలు నీటమునిగి పంటనష్టం జరిగినట్లు నివేదికలు సమర్పిం చారు. అయితే క్షేత్ర స్థాయిలో ఇంకా అధికంగా పంట నష్టం జరిగినట్లు ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు సమర్పించిన వివరాలు ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పూర్తి వివరాలు సర్వేచేసి నివేదికలు సమర్పించా లని ఇనచార్జి మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో వ్యవ సాయశాస్త్రవేత్తలు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పప్పు శనగ ఇతర పంట నష్టంపై  సర్వేచేశారు. వరుసగా పది రోజులపాటు కురిసిన వర్షాలకు నేలలో అఽధికశాతం తేమ ఉండటంతో తెగుళ్లుసోకి భారీగానే పంటనష్టం జరిగినట్లు గుర్తించారు.


1,11,786 హెక్టార్లల్లో పంటనష్టం అంచనా 

జిల్లా  వ్యాప్తంగా అధిక వర్షాలకు 1,11,786 హెక్టార్లల్లో వివిధ రకాల పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా  వేసింది. రబీ  సీజనలో 819 15 హెక్టార్లల్లో సాగు చేసిన పప్పుశనగ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే  వరి   107 10 హెక్టార్లు,  ప్రత్తి 13519 హెక్టార్లు,  ఆముదం 2919 హెక్టార్లు,  ఇతర పంటలు  2723 హెక్టా ర్లల్లో పంట నష్టం జరిగినట్లు జేడీఏ చంద్రానాయక్‌ పే ర్కొన్నారు. అధిక వర్షాలకు అన్నిరకాల పంటలకు సం బంధించి రూ.495కోట్ల విలువైన 1,23,774 మెట్రిక్‌టన్నుల  దిగుబడి నష్టపోయినట్టు తెలిపారు. 


నేటి నుంచి ఆర్బీకేల్లో రైతుల జాబితా ప్రదర్శన 

జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో శనివారం నుంచి ఆరు రోజులపాటు పంటనష్టపోయిన రైతుల జాబితాను ప్రదర్శించనున్నారు. 33 శాతం కంటే అధికంగా పంట నష్టం జరిగిన పంటల వివరాలను రైతుల వారిగా సేక రించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా ఎక్కడైనా పంట నష్టపోయి పేర్లు నమోదు కాకపోతే స్థానిక మండల వ్యవసాయ అధికారికి రాత పూర్వకంగా తెలియజేయాలని జేడీఏ పేర్కొన్నారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదులను ఆరు రోజుల్లోగా  పరిష్కరించి తుది జాబితాను జేడీఏ  కార్యాల యానికి పంపుతారన్నారు. ఆ తర్వాత కలెక్టర్‌  అనుమతి లో పంట నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి పంపుతా మన్నారు.


Updated Date - 2021-12-04T06:49:48+05:30 IST