
ప్రభుత్వానికి కలెక్టర్ ప్రాథమిక నివేదిక
ఒంగోలు(కలెక్టరేట్), మే 13: అసాని తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రెండురోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో 726.72 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్ దినేష్‌కుమార్ నివేదికను పంపారు. పత్తి 549.80 హెక్టార్లు, వరి 3.24 హెక్టార్లు, మినుము 84.21 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఈ పంటలు 1,612మంది రైతులకు చెందినవిగా గుర్తించారు. పంటనష్టం రూ.5.02కోట్ల మేర ఉంటుందని అధికారులు అంచనా వేశారు.