Advertisement

వర్షాలతో దెబ్బతిన్న పంటలు..రైతులను ఆదుకోవాలి

Sep 16 2020 @ 01:39AM

శాసనసభలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


నారాయణఖేడ్‌, సెప్టెంబరు 15 : ఇటీవలె కురిసిన వర్షాలతో కొద్ది రోజుల్లో చేతికొచ్చే పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకోవాలని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మంగళవారం శాసనసభలో కోరారు. నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న అసెంబ్లీలో సమస్యలపై ప్రస్తావించారు. నియోజకవర్గంలో చెరువులు, కుంటలు లేనందున అధికశాతం రైతులు వర్షాధార పంటలనే సాగు చేస్తారని, ఈ ఏడాది సాగు చేసిన పెసర, మినుము, సోయా, పత్తి పంటలు అధికశాతం దెబ్బతిన్నదన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా నియోజకవర్గంలోని రైతులకు వంద కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరిందని, దీంతో అధికశాతం రైతులు వలసలు మాని స్వగ్రామాల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.


అయినప్పటికీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని వారిని ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గంలో గతంలో  చెరువులను నూతనంగా నిర్మించడానికి అనుమతించారని, వాటి కోసం నిధులను విడుదల చేయాలన్నారు. నాలుగు చెరువులకు హైడ్రాలిక్‌ అనుమతులు ఇచ్చినందున, వాటికి కూడా నిధులు విడుదల చేయాలని కోరారు. మరో 12 చెరువులకు ప్రతిపాదనలు పంపామని, వాటికి కూడా హైడ్రాలిక్‌ అనుమతులు ఇప్పించాలని దీంతో ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 

Follow Us on:
Advertisement
Advertisement