రైతుల సంక్షేమానికి కేంద్రమంత్రి నిర్మలమ్మ పథకాలు

ABN , First Publish Date - 2022-02-01T17:13:02+05:30 IST

దేశంలోని రైతులకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాలు ప్రకటించారు....

రైతుల సంక్షేమానికి కేంద్రమంత్రి నిర్మలమ్మ పథకాలు

న్యూఢిల్లీ : దేశంలోని రైతుల సంక్షేమానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పథకాలు ప్రకటించారు. పార్లమెంటులో మంగళవారం తన బడ్జెట్ ప్రసంగంలో రైతుల కోసం పలు పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా మంత్రి ప్రకటించారు. భారతదేశంలోని రైతులకు రసాయన రహిత సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంట అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, క్రిమిసంహారక మందుల పిచికారీ కోసం కిసాన్ డ్రోన్‌లను వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు.. 2.37 లక్షల కోట్ల రూపాయలను  ఎంఎస్‌పిని నేరుగా రైతులకు చెల్లిస్తామని సీతారామన్ చెప్పారు.


Updated Date - 2022-02-01T17:13:02+05:30 IST