ఆలయ క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు
ఐరాల(కాణిపాకం), జనవరి 23: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు కావడంతో ఉదయం నుంచి స్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. రద్దీ అధికంగా ఉండడంతో స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.