మహానందిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-15T05:54:33+05:30 IST

మహానంది క్షేత్రం భక్తుల రద్దీతో కళ కళలాడింది.

మహానందిలో భక్తుల రద్దీ
మహానంది ఆలయంలో క్యూలైన్‌లో భక్తులు

మహానంది, ఆగస్టు 14: మహానంది క్షేత్రం భక్తుల రద్దీతో కళ కళలాడింది. వరుసగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావడంతో కుటుంభ సమేతంగా తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు శనివారం రాత్రే మహానందికి చేర డంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో నెలకొంది. వసతి గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయం ప్రాంగణంలోని పరిసరాల్లో నిద్రించడం జరిగింది. ఆదివారం తెల్లవారుజాముననే భక్తులు రుద్రగుండం కోనేరుతో పాటు రెండో ప్రాకారంలోని కోనేర్లల్లో పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. మహానందీశ్వరుని ధర్శనం కోసం గంటల కొద్ది క్యూలో నిల్చొని భక్తులు కాయ కర్పూరాలు సమర్పించుకొన్నారు. 

Updated Date - 2022-08-15T05:54:33+05:30 IST