ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-05-16T06:41:59+05:30 IST

ధర్మపురి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. దీంతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి.

ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ
లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్న భక్తులు

ధర్మపురి, మే 15: ధర్మపురి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. దీంతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. సెలవు దినం కావటం వల్ల ఉదయం వరకు క్షేత్రానికి అనేక మంది భక్తులు తరలి వచ్చారు. గోదావరి నదిలో అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయాలకు చేరుకుని స్వామి వారలను దర్శనం చేసుకున్నారు. కొందరు భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసి కుంకుమార్చన, అభిషేకాది పూజలు, స్వామి వారి నిత్య కళ్యాణం చేయించారు. ఆలయాల్లో స్వామి వారలను అందంగా వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. స్వామి వారలకు వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ, మంత్రోచ్ఛరణల మధ్య ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, రమణాచార్యా, నరసింహమూర్తి, శ్రీధరాచార్యా, అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి వరకు భక్తులు స్వామి వారలను దర్శనం చేసుకోవటం అగుపించింది. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు తగు సేవలు అందించారు. 


Updated Date - 2022-05-16T06:41:59+05:30 IST