్ఖ శ్రీశైలంలో భక్తుల రద్దీ

Sep 20 2021 @ 00:29AM

 శ్రీశైలం, సెప్టెంబరు 19: ప్రముఖ శైవ క్షేత్రంలో  ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది.  వేకువజాము నుంచే క్యూ లైన్ల వద్ద బారులు తీరారు. అలాగే  స్వామి అమ్మవార్లకు నిర్వహించే ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకొని భక్తులు మొక్కులను తీర్చుకొన్నారు. వేకువజామునుంచే కళ్యాణ కట్ట వద్ధ భక్తులు మల్లయ్యస్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.   రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని క్షేత్ర పరిధిలోని గంగాసదనం వద్ద, పాతాళగంగమార్గంలో నీలకంఠేశ్వర డార్మిటరీ వద్ద నిర్వహించారు.  

 స్వామి అమ్మవార్లకు   పల్లకి సేవ 

  శ్రీశైలం మహా క్షేత్రంలో లోకకళ్యాణం కోసం ఆదివారం   స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పూజలలో దేవస్థానం ఈవో లవన్న పాల్గొన్నారు. 

  ముగిసిన గణపతి నవరాత్రులు 

 శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 10న వినాయక చవితిని పురస్కరించుకొని ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి.   ప్రతిరోజూ రత్నగణపతి,  సాక్షిగణపతి, సాక్షిగణపతి ఆలయ ప్రాంగణంలో నెలకొల్పిన మృత్తికాగణపతికి విశేష పూజలు, హోమాలు చేశారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా స్వామివారి యాగశాలలో నిత్యహోమాలు, గణపతి హోమం, జయాదిహోమం జరిపించారు.  

 శ్రీశైల దేవస్థానానికి  విరాళాలు

 శ్రీశైలం దేవసాఽ్థనం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళాన్ని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌కు చెందిన మేఘనాథ్‌రెడ్డి దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావుకు అందజేశారు.  అలాగే గో సంరక్షణ నిధికి జీడిమెట్లకు చెందిన ఎస్‌. సాంబశివరావు లక్ష విరాళాన్ని, కుటీర నిర్మాణ పధకానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు రూ. 5 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో  దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌ లవన్నకు అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. 




Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.