ఓటీటీలో రవిబాబు 'క్రష్‌' రిలీజ్ డేట్ ఫిక్స్

Jul 1 2021 @ 09:03AM

రవిబాబు దర్శకత్వంలో రూపొందిన 'క్రష్‌' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఇప్పుడప్పుడే థియేటర్స్‌లో బొమ్మపడే అవకాశాలు కనిపించకపోవడంతో చిన్న సినిమాలు, కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీలనే నమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలోనే దర్శక, నిర్మాత రవిబాబు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'క్రష్' ఓటీటీ రిలీజ్‌కి రెడీ అవుతున్నారు. వాస్తవంగా ఈ సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలనుకుంది చిత్రబృందం. అయితే ఇటీవల సెన్సార్‌కి వెళ్ళిన ఈ చిత్రానికి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటికి సెన్సార్ సభ్యులు కట్స్ ఇచ్చారట. వాటిని కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని దర్శకుడు రవిబాబు భావించి, కట్స్‌కి అంగీకరించలేదట. ఓటీటీ ఆప్షన్ ఉండటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే అడల్ట్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ జీ 5 సంస్థ సొంతం చేసుకుంది. ఇందులో జూలై 9వ తేదీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్‌ సాయి, అంకిత మనోజ్, పాండే, శ్రీసుధా రెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.