కంటతడి పెట్టిస్తున్న సెక్స్ వర్కర్ యధార్థ గాథ.. ఉపాధి కోసం వచ్చి.. ఈ రొంపిలో ఎలా కూరుకుపోయిందంటే..

ABN , First Publish Date - 2021-10-21T17:13:16+05:30 IST

‘‘మొదట్లో అతను అప్పుడప్పుడు మేముండే..

కంటతడి పెట్టిస్తున్న సెక్స్ వర్కర్ యధార్థ గాథ.. ఉపాధి కోసం వచ్చి.. ఈ రొంపిలో ఎలా కూరుకుపోయిందంటే..

‘‘మొదట్లో అతను అప్పుడప్పుడు మేముండే వేశ్యాగృహానికి వచ్చేవాడు. నాతో గడిపేవాడు.. అయితే ఆ తరువాత మెల్లమెల్లగా నాకు మరింత దగ్గరయ్యాడు. తెలియకుండా మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది’’.. యూపీలోని రెడ్‌లైట్ ఏరియా నుంచి విముక్తి పొందిన అనిత (పేరు మార్పు) మాటలివి.. చీకటిలో కూరుకుపోయిన ఆమె జీవితానికి ఒక వ్యక్తి వెలుగు ప్రసాదించాడు. వేశ్యావృత్తిలో మగ్గిపోయేవారికి నిజమైన ప్రేమ అనేది దొరకడం అసాధ్యం. కానీ అనిత విషయంలో దీనికి భిన్నంగా జరిగింది. ఫలితంగా ఆమె ఇప్పుడు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగిస్తోంది.


ఉన్నట్టుండి మనీష్ ఒకరోజు తన మనసులోని మాట నాకు చెప్పాడు. అది వినగానే నాకు గుండె ఝల్లుమనిపించింది. అతను నన్ను ఈ నరకకూపం నుంచి తప్పించాలనుకున్నాడు. అయితే మొదట నేను మనీష్ మాటలను ఎంతమాత్రం నమ్మలేదు. అయితే ఆ తరువాత నుంచి మనీష్ నా దగ్గరకు రావడం మరింతగా పెరిగింది. అనంతరం మనీష్.. మీరఠ్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఇక్కడ వేశ్యావృత్తిలో చిక్కుకున్న అమ్మాయిలందరికీ విముక్తి కల్పించాడు.  ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మాకందరికీ మరో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు నాకు మనీష్‌పై పూర్తి నమ్మకం కలిగింది. దీంతో అతనితో పెళ్లికి ఒప్పుకున్నాను. మనీష్ తల్లిదండ్రులు కూడా తమ పెళ్లికి అంగీకారం తెలిపారు. ఇప్పుడు నాకు ఒక మంచి జీవితం లభించింది. ఒక కుమార్తె కూడా పుట్టింది’’ అని అనిత తెలిపింది.


పశ్చిమ బంగాల్‌ నుంచి వచ్చిన అనిత తన జీవితంలో లెక్కలేనన్ని చేదు అనుభవాలను ఎదుర్కొంది. ఎట్టకేలకు వేశ్యావృత్తి నుంచి విముక్తి పొందిన ఆమె.. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత వివరాలను వెల్లడించింది. ‘‘మా ఇంట్లో మా అమ్మా, నాన్న, చెల్లెలు, అన్నయ్య, నేను ఉండేవాళ్లం. ఆర్థిక సమస్యలు నిత్యం వెంటాడేవి. దీంతో ఇంట్లో మరొకరు కూడా సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పట్టణంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. మా అమ్మానాన్నలకు కూడా ఈ సంగతి చెప్పాడు. మంచి జీతం వస్తుందని కూడా నమ్మించాడు. అతను ఐదేళ్ల క్రితం నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు. కొన్నాళ్లు ఖాళీగా ఉంచిన తరువాత రెడ్‌లైట్ ఏరియాలో నన్ను అమ్మేశాడు. నాకు తప్పించుకునేందుకు మరో మార్గం దొరకలేదు. అది నాకు జైలులా అనిపించేది. బలవంతంగా నన్ను విటుల దగ్గరకు పంపించేవారు.  ఈ పనులు చేయకపోతే చంపేస్తామని బెదిరించేవారు. దీంతో నేను మానసికంగా కుంగిపోయాను. మరోమార్గం లేక వేశ్యావృత్తినే కొనసాగించాను. కొన్నాళ్లకు మనీష్(పేరు మార్పు)తో నాకు పరిచయం ఏర్పడింది. అది ఈ నరకకూపం నుంచి నన్ను బయటపడవేస్తుందని ఆరోజు గ్రహించలేకపోయాను. మనీష్ తరచూ నన్ను కలుసుకునేందుకు వచ్చేవాడు. అతను ప్రేమగా మాట్లాడుతుంటే నాకు ప్రాణం లేచివచ్చేది.

Updated Date - 2021-10-21T17:13:16+05:30 IST