క్రిప్టో కరెన్సీ పతనం...

ABN , First Publish Date - 2021-06-17T21:23:33+05:30 IST

ఈ ఏడాది ప్రారంభంలో బిట్ కాయిన్‌లో.. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని. టెస్లా ఇంక్... భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

క్రిప్టో కరెన్సీ పతనం...

ముంబై : ఈ ఏడాది ప్రారంభంలో బిట్ కాయిన్‌లో.. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని. టెస్లా ఇంక్... భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే... బిట్ కాయిన్ సహా క్రిప్టోకరెన్సీలు భారీగా పెరిగాయి. కాగా... ఈ నేపధ్యంలో... క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఎలాన్ మస్క్ చుక్కలు చూపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.


ఈ ఏడాది ప్రారంభంలో బిట్ కాయిన్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది టెస్లా ఇంక్. గ్రీన్ ఎనర్జీ కారణం చూపుతూ... కొద్ది రోజుల క్రితం బిట్ కాయిన్‌కు వ్యతిరేకంగా ఆయన ట్వీట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ క్రమంలోనే... బిట్ కాయిన్ ... 65 వేల డాలర్ల నుంచి 35 వేల డాలర్ల దిగువకు పతనమైంది. ఈ దశలో... క్రిప్టో కరెన్సీకి మళ్లీ కాస్త సానుకూలంగా ట్వీట్ చేస్తున్నారు ఎలాన్ మస్క్. మొత్తంమీద  క్రిప్టో డిమాండ్ పెరుగుతోంది.


కాగా... ఈ రోజు(గురువారం)... బిట్ కాయిన్, ఎథేరియం, డోజికాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు స్వల్పంగా నష్టపోయాయి. ఇన్వెస్టర్లు నేడు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడటంతో ఒక్కో క్రిప్టోకరెన్సీ 3-3 శాతం పెరిగింది. టాప్ టెన్ డిజిటల్ టోకెన్స్‌లో తొమ్మిది క్రిప్టోలు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ నేపధ్యంలో... ఆయా క్రిప్టో కరెన్సీల్లో కొన్నింటి విలువలిలా ఉన్నాయి. 


బిట్ కాయిన్ : $ 40,086.73, 0.97 శాతం క్షీణత,

ఎథేరియం : $ 2,527.11, 2.29 శాతం క్షీణత,

టెథర్ : $ 1.00, 0.01 శాతం క్షీణత,

భైనాన్స్ కాయిన్ : $ 361.56, 3.10 శాతం క్షీణత,

కార్డానో : $ 1.55, 1.50 శాతం క్షీణత,

డోజీ కాయిన్ : $ 0.3166, 2.99 శాతం క్షీణత,

ఎక్స్‌ఆర్‌పీ : $ 0.8647, 2.56 శాతం క్షీణత,

యూఎస్‌డీ కాయిన్ : $ 1, 0.03 శాతం పెరుగుదల. 


Updated Date - 2021-06-17T21:23:33+05:30 IST