ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తరువాత దూసుకుపోయిన ‘ఒమైక్రాన్’..!

ABN , First Publish Date - 2021-11-30T01:59:38+05:30 IST

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కొత్త వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమైక్రాన్ అని పేరుపెట్టింది. ఈ నిర్ణయమే ప్రస్తుతం ఓ క్రిప్టో కరెన్సీకి ఆయాచిత వరంగా మారింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తరువాత దూసుకుపోయిన ‘ఒమైక్రాన్’..!

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరి నోటా వినపడుతున్న పదం.. ఒమైక్రాన్. ఈ కొత్త కరోనా వేరియంట్ గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది చాలా తక్కువ కావడంతో ఇది ఏ విపత్తుకు దారి తీస్తుందో తెలియక ప్రపంచ తల్లడిల్లిపోతోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కొత్త వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమైక్రాన్ అని పేరుపెట్టింది. ఈ నిర్ణయమే ప్రస్తుతం ఓ క్రిప్టో కరెన్సీకి ఆయాచిత వరంగా మారింది. ఈ క్రిప్టో పేరు కూడా ఒమైక్రాన్ కావడంతో దాని విలువ ఏకంగా 900 శాతం పెరిగిపోయింది. నవంబర్ 27న ఒక్కో ఒమైక్రాన్ 65 డాలర్లుగా విలువ చేయగా ప్రస్తుతం ఇది 685 డాలర్లు ఎగబాకింది. కొత్త కరోనా వేరియంట్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్, క్రిప్టో మార్కెట్లు కుప్పకూలుతుంటే ఒమైక్రాన్ క్రిప్టో మాత్రం దూసుకుపోవడం గమనార్హం.

Updated Date - 2021-11-30T01:59:38+05:30 IST