సీఎస్ సోమేశ్ కుమార్ ఇంట్లో అందరికీ వ్యాక్సినేషన్

Aug 23 2021 @ 18:57PM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా జరుగుతోంది. ప్రతి ఇంట్లో కుటుంబమంతా వ్యాక్సిన్ వేసుకుంటే ఆ ఇంటికి అర్హులైన వారంతా వ్యాక్సిన్ వేసుకున్నారంటూ స్టిక్కర్ అతకిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ సన్ రైజ్ కాలనీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇంటికి కూడా జీహెచ్ఎంసి అధికారులు స్టిక్కర్అంటించారు. ఈ నివాసంలో అర్హులైనవారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంతో ‘ఈ నివాసంలో అర్హులైనవారందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు‘ అని  జిహెచ్ఎంసి సిబ్బంది స్టిక్కిర్ అతకించినట్టు అధికారులు తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.