దసరానుండే పేషంట్ల అటెండెంట్లకు వసతి సౌకర్యం: సీఎస్

ABN , First Publish Date - 2021-10-10T20:46:32+05:30 IST

నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు పేషంట్లతోపాటు వచ్చే అటెండెంట్ల దసరా నుంచే వసతి కల్పించేందుకై వెంటనే తగు ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

దసరానుండే పేషంట్ల అటెండెంట్లకు వసతి సౌకర్యం: సీఎస్

హైదరాబాద్: నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు పేషంట్లతోపాటు వచ్చే అటెండెంట్ల దసరా నుంచే వసతి కల్పించేందుకై వెంటనే తగు ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు పేషంట్లతోపాటు పెద్ద సంఖ్యలో వస్తున్న అటెండెంట్ లు సరైన వసతి, సౌకర్యాలు లేకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో షెల్టర్లు ఏర్పాటు చేయాడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరించారు. అటెండెంట్స్ కు అన్ని ప్రధాన ఆసుపత్రుల పరిసరాల్లో తగు షెల్టర్లను గుర్తించాలని చీఫ్ సెక్రటరీ అధికారులనుఆదేశించారు. 


ఈ దసరా నుండే వీటిని ప్రారంభించాలని స్పష్టం చేశారు. హరే కృష్ణ మిషన్ ఫౌండేషన్ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అటెండెంట్‌ల సౌకర్యార్థం అన్నివసతులు కలిగిన ఆశ్రయం, తాగునీరు, శానిటేషన్ లతోపాటు మహిళా అటెండెంట్‌లకై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. నిమ్స్, నిలోఫర్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, టిమ్స్, కింగ్ కోటి, ఫీవర్ హాస్పిటల్, ఎంజె క్యాన్సర్హాస్పిటల్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ వంటి ఆసుపత్రులకు రోగులతో పాటు పెద్ద సంఖ్యలో అటెండర్లు వస్తున్నారు. వీరందరికీ దసరా పండుగ నుండి ఈ సౌకర్యాలను కల్పించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-10-10T20:46:32+05:30 IST