భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

ABN , First Publish Date - 2020-09-26T20:21:43+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అన్నిజిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అన్నిజిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్‌ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాల కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులందరూ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా తగు చర్యలు తీసుకోఆలన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని, సెలవు దినాల్లో ఎటువంటి మినహాయింపు అనుమతులు ఇవ్వరాదని సీఎస్‌ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్య ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎస్‌ సూచించారు. వర్సాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్‌ రూంకు పంపాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-09-26T20:21:43+05:30 IST