ఈ నెల 22వ తేదీ నాటికి టార్గెట్ లను సాధించాలి: సీఎస్

ABN , First Publish Date - 2021-12-03T22:49:04+05:30 IST

అర్హత గల వారందరికీ వ్యాక్సిన్ అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ నెల 22వ తేదీ నాటికి టార్గెట్ లను సాధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొమేశ్ కుమార్ అన్నారు.

ఈ నెల 22వ తేదీ నాటికి టార్గెట్ లను సాధించాలి: సీఎస్

ఆదిలాబాద్: అర్హత గల వారందరికీ వ్యాక్సిన్ అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ నెల 22వ తేదీ నాటికి టార్గెట్ లను సాధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొమేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య, పంచాయితీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో వాక్సినేషన్ పై జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించి కరోనా టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల ప్రజలను చైతన్యం చేస్తూ వ్యాక్సిన్ అందించే బాధ్యతలను అప్పగించాలని అన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా  మెప్మా రీసోర్స్ పర్సన్ లను, వైద్య సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తూ అర్హత గల వారందరికీ వ్యాక్సిన్ అందించాలని అన్నారు. 


ఆయా గ్రామాలు, వార్డులలోని నోడల్ అధికారులు వారి పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్ చేస్తాననే ధ్యేయంతో పని చేయాలని అన్నారు. ప్రజలకు నమ్మకం కలిగిస్తూ ప్రేరేపిస్తూ వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించాలని అన్నారు. ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, కలెక్టర్లు గ్రామాలలో పర్యటించి వ్యాక్సిన్ పంపిణీ విధానాన్ని పరిశీలించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 17.6  లఓల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి వుందన్నారు. వారందరికీ ఈ నెల 22వ తేదీ నాటికి టార్గెట్ లను అధిగమించాలనీ సీఎస్ అన్నారు. టార్గెట్లకు అనుగుణంగా మంచిర్యాల, నిర్మల్, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రోజుకు 15 వేల చొప్పున , ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు 20వేల చొప్పున వ్యాక్సిన్ అందించాలన్నారు. ఓమైక్రాన్ మూడో దశ ప్రబలక ముందే రెండు డోసుల వ్యాక్సిన్ ను అందించాలన్నారు. 

Updated Date - 2021-12-03T22:49:04+05:30 IST