
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగుల విభజనపై సీఎస్ సోమేష్కుమార్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. జోనల్ వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనుంది. కమిటీల నివేదికల ఆధారంగా ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.