మద్దిపాడు పీహెచ్‌సీకి రాష్ట్రస్థాయి గుర్తింపు

ABN , First Publish Date - 2021-07-25T05:47:44+05:30 IST

మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేషనల్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ స్టాండర్డ్‌లో ప్రథమస్థానం సాధించింది. వైద్యాధికారి చంద్రశేఖర్‌బాబు అందిస్తున్న కొవిడ్‌ సేవలను రాష్ట్ర ప్ర భుత్వం గుర్తించి ప్రశంసాపత్రాన్ని అందించారు.

మద్దిపాడు పీహెచ్‌సీకి రాష్ట్రస్థాయి గుర్తింపు
కలెక్టర్‌ నుంచి ప్రశంశాపత్రం అందుకుంటున్న డాక్టర్‌ చంద్రశేఖర్‌బాబు

మద్దిపాడు, జూలై 24 :  మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేషనల్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ స్టాండర్డ్‌లో ప్రథమస్థానం సాధించింది. వైద్యాధికారి చంద్రశేఖర్‌బాబు అందిస్తున్న కొవిడ్‌ సేవలను రాష్ట్ర ప్ర భుత్వం  గుర్తించి ప్రశంసాపత్రాన్ని అందించారు. అలాగే జిల్లాస్థాయి లో కాయకల్ప అవార్డును  సైతం దక్కించుకున్నారు. ఈనేపథ్యంలో శ నివారం ఒంగోలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌బాబుకు ప్రశంపత్రాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ వైద్యాధికారి చంద్రశేఖర్‌బాబు సేవలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిం దని, పనిలో నిబద్ధత ఉంటే మంచిపేరు వస్తుందని అభినందించారు. చంద్రశేఖర్‌బాబు మాట్లాడుతూ నేషనల్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ అవార్డు మద్దిపాడు పీహెచ్‌సీ దక్కడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ వెంకటమురళి, డీఎంహెచ్‌వో రత్నావళి, డాక్టర్‌ ఉషారాణి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T05:47:44+05:30 IST