కుకుంబర్‌ మింట్‌!

ABN , First Publish Date - 2021-03-29T06:40:16+05:30 IST

వేసవిలో ఒంట్లో నీరు తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు కుకుంబర్‌ మింట్‌ డ్రింక్‌ తాగితే నీటి భర్తీతో పాటు శక్తి వస్తుంది...

కుకుంబర్‌ మింట్‌!

వేసవిలో ఒంట్లో నీరు తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు కుకుంబర్‌ మింట్‌ డ్రింక్‌ తాగితే నీటి భర్తీతో పాటు శక్తి వస్తుంది. 


కావలసినవి: కీరదోస ఒకటి, చక్కెర-- టేబుల్‌ స్పూన్‌, పుదీనా ఆకులు 6-8, నీళ్లు - నాలుగు కప్పులు, కొద్దిగా బ్లాక్‌ సాల్ట్‌. 

తయారీ: కీరదోస పొట్టు తీసి, ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. తరువాత చక్కెర, పుదీనా ఆకులు, కప్పు నీళ్లు వేసి మిక్సీ పట్టాలి. తరువాత కొద్దిగా బ్లాక్‌ సాల్ట్‌ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కీరదోస మిశ్రమంలో మూడు కప్పుల నీళ్లు పోయాలి. ఐస్‌క్యూబ్స్‌, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసి కుకుంబర్‌ మింట్‌ డ్రింక్‌ను అందించాలి.

Updated Date - 2021-03-29T06:40:16+05:30 IST