సాగు చట్టాలపై కేంద్రం క్షమాపణ చెప్తే సరిపోదు: కేసీఆర్

ABN , First Publish Date - 2021-11-21T00:52:03+05:30 IST

వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

సాగు చట్టాలపై కేంద్రం క్షమాపణ చెప్తే సరిపోదు: కేసీఆర్

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా కేంద్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. చివరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తామని ప్రకటించారు. అవకాశం ఉంటే ప్రధాని మోదీని కూడా కలుస్తామని తెలిపారు. సాగు చట్టాలపై కేంద్రం క్షమాపణ చెప్తే సరిపోదన్నారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 


విద్యుత్ చట్టాలు తెచ్చి మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌ చట్టాన్ని కూడా కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాలు తేల్చాలని పట్టుబట్టారు. నీటి వాటాలు తేల్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై కేంద్రం తేల్చాలన్నారు. జన గణనలో బీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నామని కేసీఆర్ తెలిపారు.

Updated Date - 2021-11-21T00:52:03+05:30 IST