ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కల పెంపకం

ABN , First Publish Date - 2020-08-05T09:55:35+05:30 IST

నగరవ్యాప్తంగా ఉన్న ఖాళీస్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు.

ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కల పెంపకం

కమిషనర్‌ వల్లూరి క్రాంతి 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 4: నగరవ్యాప్తంగా ఉన్న ఖాళీస్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం హరితహారంలో భాగంగా నగరంలో మొక్కలు నాటేందుకు పలు ప్రాంతాల్లో పర్యటించారు. వెంటనే గుంతలు తవ్వే ఏర్పాట్లు చేసి వేగవంతంగా మొక్కలు నాటాలని హరితహారం ఇన్‌చార్జి నరేందర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ఎవెన్యూ పద్ధతిలో మొక్కలు నాటుతామని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన స్థలాల్లో పలుచోట్ల బ్లాక్‌, మియావాకీ ప్లాంటేషన్‌ పద్ధతిలో మొక్కలు నాటామని తెలిపారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌ పద్ధతిలో రోడ్లపై నాటే ప్రతి మొక్కకు ట్రీగార్డు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-08-05T09:55:35+05:30 IST