సన్నాల సాగుపై అధికారుల నిలదీత

ABN , First Publish Date - 2020-11-29T05:58:00+05:30 IST

వ్యవసాయాధికారులు చెప్పిన సూచనల మేరకే సన్నరకం పంటను సాగు చేశామని ప్రస్తుతం క్వింటాల్‌కు ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో సన్నాలకు 2500 రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమని రైతులు అధికారులను నిలదీశారు.

సన్నాల సాగుపై అధికారుల నిలదీత

డిచ్‌పల్లి, నవంబరు 28:  వ్యవసాయాధికారులు చెప్పిన సూచనల మేరకే సన్నరకం పంటను సాగు చేశామని ప్రస్తుతం క్వింటాల్‌కు ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో  సన్నాలకు 2500 రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమని రైతులు అధికారులను నిలదీశారు. శనివారం మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి, సాంపల్లి గ్రామాల్లో  రైతు అవగాహన సద స్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఖిల్లా డిచ్‌పల్లిలో ప్రభుత్వం అధికారులు సూచించిన ప్రకరమే సన్నరకం వరిధాన్యం పంటలను సాగు చేశామని, ప్రస్తుతం సన్నలకు మద్దతు ధర ఇవ్వకుంటే రైతులకు అన్యాయం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం సన్నాలు సాగు చేసే రైతులకు క్వింటాలుకు 2500 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంత రం వ్యవసాయాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:58:00+05:30 IST