రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ప్రారంభం

Sep 25 2021 @ 00:19AM
పాలరాతి సమాధి నాటికలోని సన్నివేశం

గుంటూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 24: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై  సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువ కళావాహిని ఆధ్వర్యంలో డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌ వారి 27వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు లంకా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిఽఽథిగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, అతిఽథులుగా ప్రగతి కళామండలి అధ్యక్షుడు నూతలపాటి సాంబయ్య, రంగస్థల సినీనటుడు నాయుడు గోపి, కళాకారుడు బి.వేదయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌ మస్తానయ్య తదితరులు పాల్గొని రంగస్థల సినీ రచయిత మాడభూషి దివాకర్‌బాబు దంపతులను డాక్టర్‌ అక్కినేని జీవన సాఫల్య రంగస్థల పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం సాయి కార్తీక్‌ క్రియేషన్స్‌ కాకినాడ వారిచే పనసాల రచించిన సీహెచ్‌ విజయలక్ష్మి దర్శకత్వం వహించిన పాలరాతి సమాధి, హర్ష క్రియేషన్స్‌ విజయవాడ వారిచే కత్తి శ్యామ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించిన నాగూడు నాటికలు పోటీలో ప్రదర్శించారు. కార్యక్రమాన్ని జి.మల్లిఖార్జునరావు, బొప్పన నరసింహారావు, డి.తిరుమలేశ్వరరావు, జివిజి శంకర్‌లు పర్యవేక్షించారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.